అనకాపల్లి నిందితులకు ఆరోగ్య సమస్య తదితర సమస్య ఏది వచ్చినా అధికారులుదే బాధ్యత అని న్యాయమూర్తి సన్యాసి నాయుడు స్పష్టం చేశారు.
హై కోర్టు ఆదేశాల మేరకు లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం జైలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిందితులతో మాట్లాడుతూ సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం కావాలంటే కల్పిస్తామన్నారు. వారములో రెండు రోజులు డాక్టర్ తో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆహార మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాళ్ళపాలెం ఏపీ గురుకుల బాలికల కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైలు ఇంచార్జి సూపరిండంట్ డి. వి. లేయర్ , ప్రిన్సిపల్ గ్రేసి మరియు ఏఎస్ఐ మణి కుమారి, కశింకోట పోలీస్ స్టేషన్ మరియు న్యాయ సహాయకులు కౌన్సిల్ సాయిరాం, పి ఎల్ వి మణి, మరియు ఎం ఎల్ ఎస్ సి సిబ్బంది సత్యనారాయణ, సంధ్య విద్యార్ధులు పాల్గొన్నారు.