📢 Advertisement Space

29వ రోజుకు చేరుకున్న శ్రీ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి రాష్ట్ర జాతర మహోత్సవాలు

🗞️ బిబి న్యూస్ | 15 Apr 2026

ఉత్తరాంధ్రలో ఎంతో ప్రసిద్ధి గాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి రాష్ట్ర జాతర మహోత్సవాలు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ జాతర మహోత్సవాల్లో ఎన్టీఆర్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు విశేషంగా ఆకట్టుకున్నారు.అనకాపల్లి జిల్లాలో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ ఇంచార్జ్ రాంకీ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి రాష్ట్ర జాతర ఇప్పటికే నెల రోజుల పాటు వైభవంగా సాగుతోంది. ఈ సంవత్సరం కొత్త అమావాస్య జాతర నుంచి ఉగాది వరకు జరుగుతున్న ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.ఎన్టీఆర్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ మైదానంలో విశాఖపట్నం వారిచే చందన్ డాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విజయనగరం వారిచే అభినయ కళాక్షత్రం సమూహం ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు కూడా ప్రజల నుంచి ఉత్సాహభరిత స్పందనలు అందుకున్నాయి.నెల రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాలు ఎన్టీఆర్ మైదానానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, రాష్ట్ర బిజెపి నాయకులు సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఈర్ల శ్రీరామ్ మూర్తి, డిసిఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ హాజరయ్యారు. వీరు జ్యోతి ప్రజ్వలన చేసి తదుపరి అమ్మవారి జాతర పురస్కారాలను అందజేశారు.తెలంగాణ జానపద గాయకుడు రాంబాబు, జాతీయ అథ్లెటిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన లవ్ కుమార్, ఎమ్మార్వో లంబా రాజేంద్రప్రసాద్‌లను ప్రత్యేకంగా సత్కరించి పట్టు వస్త్రాలు అందజేసి గౌరవించారు. జానపద గాయకుడు రాంబాబు ఆలపించిన జనపన గేయాలు మైదానంలోని భక్తులను ఆవేశంతో నిలబెట్టాయి. అలాగే కూచిపూడి కళాకారులు ఘన ప్రదర్శన ఇవ్వడంతో వారిని ప్రశంసా పత్రాలతో అభినందించారు.ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను, ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండల సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు తిమ్మాపురం చక్రవర్తి, సకల గోవిందరావు, గండేపల్లి మురళి, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పాలకులు హాజరై జాతర వైభవానికి ప్రత్యేకత తీసుకువచ్చారు. భక్తుల పెద్ద సంఖ్యలో హాజరైన ఎన్టీఆర్ మైదానం పూర్తిగా పుణ్య వాతావరణంగా మారింది.