పల్లా శ్రీనివాసరావుని సత్కరించిన రాష్ట్ర చైర్మన్ లు పీలా, బత్తుల,మళ్ళ
🗞️ బిబి న్యూస్ | 18 Apr 2026
గాజువాక, ఏప్రిల్ 18: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి పల్లా శ్రీనివాసరావుని నియమించిన సందర్భంగా గాజువాక శాసనసభ్యులు, టీడీపీ నాయకులు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు , రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొణతాల రత్నకుమారి అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి ఆలయం డైరెక్టర్ పొలిమేర ఆనంద్, కాయల ప్రసన్న, కురాకుల భారతి తదితరులు పాల్గొన్నారు.