కొప్పాకలో రాధాకృష్ణుల ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు
🗞️ బిబి న్యూస్ | 19 Apr 2026
అనకాపల్లి మండలం కొప్పాక గ్రామంలో వెలసిన శ్రీ రాధాకృష్ణుల దేవాలయాన్ని దర్శించుకున్న అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఆలయ వ్యవస్థాపకుడైన దాడి వీరునాయుడు ఆహ్వానం చేసిన సందర్భంగా, గ్రామ పెద్దలు, స్థానికుల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న వివరాలు వివరించారు.అద్భుతమైన విగ్రహాలు, సంప్రదాయబద్ధ నిర్మాణం గురించి చెప్పుకుంటూ, ఈ సంవత్సరంలోనే వైభవోపేతంగా ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దాడి వీరునాయుడు నాయకత్వంలో ఈ ఆలయం గ్రామవాసులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. దాడి వీరునాయుడు దంపతులకు ద్వారపురెడ్డి శాలువా కప్పి చిరు సత్కారం చేశారు.అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, "దాడి వీరునాయుడు సమాజానికి ఆదర్శం. ప్రతి ఒక్కరు ఆయనను అనుసరించి, ఆధ్యాత్మిక చింతనలు పెంచుకుని, సమాజ సేవలో పాల్గొనాలి" అని పిలుపు నిచ్చారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దాడి వీరునాయుడు ఉత్సాహం, సమర్పణతో ఈ ఆలయం త్వరలోనే పూర్తవుతుందని, ఇది కొప్పాక గ్రామ ఆధ్యాత్మిక గొప్పగా నిలుస్తుందని స్థానికులు ఆనందంగా చెబుతున్నారు.