అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ అభివృద్ధికి తోడ్పడండి: సర్వేజనా ఐక్యవేదిక
🗞️ బిబి న్యూస్ | 20 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 20: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా, అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. అమ్మవారి పండుగ వంటి ఘన కార్యక్రమాలు జరుపుతున్న నాయకులు ఈ గ్రౌండ్‌లో కనీస వసతులు కల్పించకపోవడం శోచనీయమని సర్వేజనా ఐక్యవేదిక వ్యవస్థాపకులు వ్యక్తం చేశారు.గ్రౌండ్‌లో టాయిలెట్లు, మంచినీటి సదుపాయాలు లేకపోవడం, పరిసరాల పరిశుభ్రత లోపం కనిపించడం వంటి సమస్యలు పరిష్కరించబడలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంగీత, గేయ కళాకారులను ఎన్టీఆర్ గ్రౌండ్‌లలో సన్మానిస్తూ భారీ ఖర్చులు చేస్తున్న పాలకులు, ఇక్కడ త్రాగునీరు, లేడీస్ వాష్‌రూములు, బాత్‌రూమ్‌లు కల్పించడానికి కనీస ఖర్చు చేయకపోవడం ఆశ్చర్యకరం. జిమ్ పరికరాలు ఒక సంవత్సరంగా పనిచేయట్లేదు. వర్షాలతో గ్రౌండ్ మొత్తం నీటగిరుల్లో మునిగిపోతోంది.ఈ గ్రౌండ్‌ను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారు కట్టించారు. 2022లో మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి గారు మహిళలకు ఒక భవనం నిర్మించారు. ఒకసారి కలర్లు వేశారు. అంతే, ఇప్పటివరకు ఇతర అభివృద్ధి ఏమీ జరగలేదు.ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడం కాదు, హాయంలో విచారం వ్యక్తం చేస్తున్నామని నాయకులు చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్, టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుని ఈ గ్రౌండ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లమని కోరారు.NHRPF హ్యూమన్ రైట్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కోరిబిల్లీ పరి, సూరంపూడి పవన్ కిరణ్, యెల్లపు సతీష్, మొటూరు రమేష్, పోలవరపు మహేష్, గిసాల ధనుష్, పోతలా చరణ్ తేజ, వారధి పూర్షోత్తము ఈ అభ్యర్థనకు సంతకాలు చేశారు.