అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో వారి నివాసం వద్ద కూటమి నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి సీఎం సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజవర్గం టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ,రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు పాల్గొన్నారు.