ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో డివిఎన్ కళాశాలకు ఉత్తమ అవార్డులు
🗞️ బిబి న్యూస్ | 21 Apr 2026
అనకాపల్లి: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనుబంధ కళాశాలలకు నిర్వహించిన కార్యక్రమంలో అనకాపల్లి దాడి వీర నాయుడు (డివిఎన్) కళాశాలకు బెస్ట్ కాలేజ్, బెస్ట్ ప్రిన్సిపల్, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ స్టూడెంట్ అవార్డులు గెలుచుకుంది.కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ, యూనివర్సిటీ పరిధిలో 350 కళాశాలల నుంచి తమ కళాశాలకు ఈ అవార్డులు దక్కడం ఎంతో గర్వకారణం మరియు ఆనందకరమని అన్నారు.ఈ సందర్భంగా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు పొందిన ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్, బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డుకు వైస్ ప్రిన్సిపల్ ఎస్.దయామాధురి, బెస్ట్ స్టూడెంట్ అవార్డుకు విద్యార్థిని గగనం అంజనిని చైర్మన్ దాడి రత్నాకర్ అభినందించారు.