📢 Advertisement Space

అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ

🗞️ బిబి న్యూస్ | 18 Feb 2026

అనకాపల్లి, ఫిబ్రవరి 18: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంటరీ సభ్యుడు డాక్టర్ సి.ఎం. రమేష్ జన్మదిన సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ స్వయంగా కలిసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా గౌహతిలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలపడంతో ఎంపీ గొప్ప సంతోషం వ్యక్తం చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ప్రసిద్ధ కామాఖ్యా దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సి.ఎం. రమేష్ ముఖ్యమంత్రిని సత్కరించి ఈ అపూర్వ అవకాశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.