📢 Advertisement Space

అనకాపల్లి టీడీపీ నాయకులు సమావేశం: రేపు రాంబిల్లి సీఎం పర్యటన విజయం కోసం సన్నాహాలు

🗞️ బిబి న్యూస్ | 22 Apr 2026

అనకాపల్లి, ఏప్రిల్ 22: అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.అనకాపల్లి పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో రేపటి రాంబిల్లి ముఖ్యమంత్రి పర్యటనపై అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ నడిపారు.పార్టీ నియమించిన పరిశీలికులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు రత్నాకర, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్రలు పాల్గొని, జనసమీకరణ కోసం సమీక్షా సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ యూనిట్లు, బూత్‌లు, శ్రేణుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.