📢 Advertisement Space

డిల్లీ లో జరిగిన ఆల్ ఇండియా బంజారా సమ్మేళనంలో పాల్గొన్న బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జగన్ నాయక్

🗞️ బిబి న్యూస్ | 26 Apr 2026

న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సమ్మేళనం ఘనంగా జరిగింది.ఈ సమ్మేళనంలో బంజారా సమాజ హక్కులు,రిజర్వేషన్ అంశాలపై కీలక చర్చలు జరిగి, దేశవ్యాప్తంగా వారికి ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) హోదా కల్పించాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంజారులు వేర్వేరు కేటగిరీల్లో రిజర్వేషన్ పొందుతున్న పరిస్థితిని సమీక్షించిన నాయకులు, వారిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించారు.రాబోయే కులగణనలో బంజారాలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, వారి జనాభా, సామాజిక స్థితిగతులను స్పష్టంగా నమోదు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.బంజారా సమాజ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినా తగిన గుర్తింపు లేకపోవడాన్ని ఎత్తి చూపారు.ఎస్టీ హోదాతో విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ సమ్మేళనంలో ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, బంజారా భారత్ తెలంగాణ ఫౌండర్ అధ్యక్షుడు ధరావత్ రవీంద్ర నాయక్, రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జగన్ నాయక్ విస్లావత్, ఆల్ ఇండియా ఎస్సీ కాల్ కోఆర్డినేటర్ ఎస్పి సింగ్, తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ నాయకులు వి. లింగం నాయక్, కృష్ణ నాయక్, వికారాబాద్ జిల్లా చైర్మన్ శివరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.