శ్రీరాముని అవమానించిన సిననటుడు ప్రకాష్‌రాజ్ పై చర్యలు తీసుకోవాలి
🗞️ బిబి న్యూస్ | 27 Apr 2026
ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని ఎగతాళి చేసి అవమానపరిచిన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కొండకొప్పాక శ్రీ రాధాకృష్ణ దేవస్థాన అధ్యక్షులు దాడి వీరునాయుడు (కృష్ణస్వామి) డిమాండ్ చేశారు.అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిసి ఈ ఫిర్యాదుకు మద్దతు తెలిపారు.శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు గురించి ప్రకాష్ రాజ్ చేసిన వాఖ్యాలు హిందువుల మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీస్తాయని వారు అభిప్రాయపడ్డారు. తరచూ శ్రీరాముని అవమానిస్తూ, ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేసి చులకానలు చేయడం సమాజంలో మత ఘర్షణలు, శాంతి భద్రతలకు ముప్పు అని మండిపడ్డారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాకుండా ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేదా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొడ్డేడ నాగేశ్వరరావు, గంగ పాము నాగేశ్వరరావు, కర్రి వెంకటరమణ, శ్రీకాళహస్తి, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.