శ్రీ నూకాంబిక అమ్మవారి హుండీలో రూ.53.24 లక్షలు, 6.95 గ్రాముల బంగారం
🗞️ బిబి న్యూస్ | 30 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 30: ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో 10-04-2026 నుంచి 29-04-2026 వరకు 19 రోజుల పాటు భక్తులు సమర్పించిన ముడుపులు, మొక్కుబడుల హుండీ లెక్కింపు శుక్రవారం మండపంలో జరిగింది.
సదరు లెక్కింపులో నగదుగా రూ.53,24,668, బంగారం 6 గ్రాముల 950 మిల్లీగ్రాములు, వెండి 400 గ్రాములు సేకరణ అయింది.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్, జిల్లా సహాయ కమిషనర్ కేఎల్ సుధారాణి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంతరావు, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడ్రాజు, యర్చవరపు సంతోషి కుమారి నాగేష్ పాల్గొన్నారు.హుండీల లెక్కింపుకు దేవస్థాన సిబ్బంది, పూజారులు, శ్రీవారిసేవ సభ్యులు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవరపాలెం బ్రాంచ్ సిబ్బంది, అనకాపల్లి టౌన్ పోలీసులు, భక్తులు కూడా ఉపస్థితులు అయ్యారు.