10వ తరగతి ఫలితాల్లో మండల ప్రథమ స్థానం సాధించిన శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్
🗞️ బిబి న్యూస్ | 30 Apr 2026
కశింకోట, ఏప్రిల్ 30:10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మండల ప్రథమ స్థానాన్ని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాధించింది.ఈ పాఠశాల విద్యార్థి (హాల్ టికెట్ నంబర్: 2606104286) 600లో 590 మార్కులు సాధించి మండలంలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. పెంటకోట రిషికేష్ విజయాన్ని పాఠశాల కరస్పాండెంట్ మళ్ల జగదీష్, ప్రిన్సిపల్ మళ్ల శైలజ, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, పెద్దలు అందరూ అభినందించారు.శ్రీ వివేకానంద పాఠశాల విద్యార్థుల్లో 27 మంది 500 మార్కులకు పైగా సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ ఘనవిజయం పాఠశాల శిక్షణ విధానం,ఉపాధ్యాయుల కృషి ఫలితంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.