📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా జరిగిన బుద్ధ జయంతి ఉత్సవం

🗞️ బిబి న్యూస్ | 01 May 2026

అనకాపల్లి, శుక్రవారం: అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ (ఎ.ఎ.యం.యస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి నాలుగురోడ్ల కూడలి భగవాన్ బుద్ధ విగ్రహం వద్ద బుద్ధ జయంతి ఉత్సవ సమావేశం ఘనంగా జరిగింది.ఎ.ఎ.యం.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు,డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వ్యవస్థాపకులు దూలం బుసిరాజు భగవాన్ బుద్ధ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనకాపల్లి బౌద్ధిష్ట సొసైటీ చైర్మన్ పల్లా బాబ్జీ జ్యోతి ప్రజ్వలన చేశారు.సభాధ్యక్షత వహించిన దూలం బుసిరాజు తొలిపాలకులుగా బుద్ధ తత్వం గురించి సంక్షిప్తంగా వివరించారు. ప్రధాన వక్తగా కాండ్రేగుల సర్వేశ్వర రావు మాట్లాడుతూ, బుద్ధుని శాంతి, అహింసా సూత్రాలే ప్రస్తుత ప్రపంచ అల్లకొలతకు సమాధానమని పేర్కొన్నారు.సభకు ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ బొడ్డెడ అప్పారావు, మాజీ విశ్రాంత ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దొడ్డి రమేష్, ప్రముఖ దళిత నాయకుడు రేబాక మధు, ఆళ్ల ప్రవీణ్, అబ్దుల్ కలాం సేవాసమితి వ్యవస్థాపకులు పాల్గొన్నారు.వీరంతా బుద్ధ అష్టాంగ మార్గాలు, పంచశీలాలు తదితర విషయాలపై వివరంగా మాట్లాడారు.తుది పలుకుల్లో సభాధ్యక్షులు దూలం బుసిరాజు గారు 'బుద్ధం శరణం గత్యామి, ధమ్మం శరణం గత్యామి, సంఘం శరణం గత్యామి' శ్లోకం గురించి వివరిస్తూ సమావేశాన్ని ముగింపు జేశారు.