బాలుడు ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టులో పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్‌పై నిరసన
🗞️ బిబి న్యూస్ | 01 May 2026
అనకాపల్లి, 02 మే 2026: పరవాడ మండలం తానం గ్రామంలో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్టు చేసే విషయంలో పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా యాత సంక్షేమ సంఘం నాయకత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.వుడ్ పేట నుండి ప్రారంభమైన ర్యాలీ రామచంద్ర థియేటర్, రాజా థియేటర్, ఎన్టీఆర్ జంక్షన్ మీదుగా నెహ్రూ చౌక్ వరకు సాగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాధిత కుటుంబాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయుడు శశికాంత్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలి, బడుగు వర్గాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి అని ఆందోళనకారులు చేధరిస్తూ నినాదాలు చేశారు. తర్వాత ఆందోళనకారులు అనకాపల్లి ఎస్పీ ఆఫీసుకు వెళ్లి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ మాట్లాడుతూ, తానం గ్రామంలో యాత కుటుంబానికి చెందిన బాలుడిపై గ్రామానికి చెందిన ఆధిపత్య వర్గాలు బహిరంగంగా దాడి చేసి అవమానించడంతో ఆ బాలుడు అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పారు. బాలుడు అన్ని విషయాలు పరవాడ పోలీస్ అధికారికి మాత్రమే మరణ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పినా, సర్కిల్ ఇన్స్పెక్టర్ నిందితులతో కుమ్మక్కై కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా ప్రచారం తర్వాత ఒక నిందితుడిని మాత్రమే అరెస్టు చేసి కోర్టుకు తరలించడం, మిగిలిన వారిని ప్రత్యేక కారణాలతో బయటికి తీసుకురావడంపై మారేష్ తీవ్రంగా మండిపడ్డారు. బాలుడు ఆత్మహత్యకు కారణమైన అన్ని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయనిపక్షంలో దశల వారీగా ఉద్యమానికి సిద్ధమని పాలకులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఐ.ఆర్. గంగాధర్, రంగాల నాగరాజు, పిల్లి శ్రీనివాస్, ఎర్ర రాము, మాదిబోయిన నాగరాజు, రాయుడు రమేష్, పిల్లి రాంబాబు, నెల్లి గోపాల్, యాడ్ర అప్పలనాయుడు, కుందిరి అప్పలరాజు, విశాఖపట్నం సిటీ నాయకులు కృష్ణ గౌడ్, సంపంగి శ్రీనివాసరావు, అంగటి రాము తదితరులతోపాటు బాలుడి తల్లిదండ్రులు రాయుడు శ్రీనివాసరావు, అశ్విని కూడా పాల్గొన్నారు.