📢 Advertisement Space

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తతలకు తావివ్వొద్దు: మే 3న “చలో ఆకివీడు”కు బీఎస్పీ పిలుపు

🗞️ బిబి న్యూస్ | 01 May 2026

కాకినాడలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మే 3న నిర్వహించనున్న “చలో ఆకివీడు” కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు, దళిత క్రైస్తవులపై అణచివేత చర్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కొన్ని ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన బీఎస్పీ నాయకులు, పరిస్థితి అదుపులోకి రాకపోతే రాష్ట్రంలో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దళితుల హక్కులను కాపాడాలంటే సమాజం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మే 3న ఆకివీడు గ్రామంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. దళితులు, దళిత క్రైస్తవులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తాలని కోరారు.ఈ సందర్భంగా కాకినాడలో బీఎస్పీ నాయకులు, దళిత సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని “మీ కోసం చలో ఆకివీడు” పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా నీలం కండువాలు ధరించి కనిపించారు.ప్రధానంగా ఆకివీడులో దళితుల దేవత గొంతాలమ్మ గుడి నిర్మాణం, అలాగే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.