📢 Advertisement Space

శ్రీ నూకాంబిక ఆలయంలో వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అంజి రెడ్డి ప్రత్యేక పూజలు

🗞️ బిబి న్యూస్ | 02 May 2026

అనకాపల్లి, మే 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజి రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు విచ్చేశారు. రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ సూరంపూడి శ్రీకాంత్, అనకాపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు కాండ్రేగుల శ్యామ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.పర్యటనలో భాగంగా, 81వ వార్డు ఇంచార్జ్ బొడ్డెడ శివ, 80వ వార్డు ఇంచార్జ్ కె.ఎం. నాయుడు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ, "అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి.2029లో తప్పక జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు బాధపు కృష్ణ, స్టేట్ ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ డేని, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కర్రి రుద్రి నాయుడు, సోషల్ మీడియా కమిటీ సభ్యులు తంగిళ్ళ రామకృష్ణ, ఆర్య సోమాజుల శివకుమార్, మామిడి తారకేష్, చీపురుపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100 మంది సోషల్ మీడియా కార్యకర్తలు హాజరయ్యారు.