📢 Advertisement Space

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు తల్లి-బిడ్డ మరణాలపై న్యాయ విచారణ కోరుతూ ఫిర్యాదు

🗞️ బిబి న్యూస్ | 04 May 2026

అనకాపల్లి జిల్లాలో సంచలనం రేపిన తల్లి-బిడ్డ మరణాల ఘటనపై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రియల్ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించనున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌పీఎఫ్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కోరిబిల్లి పరి తెలిపారు.ఈ ఫిర్యాదులో,ఏప్రిల్ నెలలో అనకాపల్లిలోని ఎన్‌టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల శిశువు మరణించగా,అనంతరం మానసికంగా కుంగిపోయిన తల్లిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారని, కొద్ది రోజులకే ఆమె కూడా మృతిచెందినట్లు పేర్కొన్నారు.