📢 Advertisement Space

పూడి శ్రీహరిని ఘనంగా సత్కరించిన అనకాపల్లి 80, 81 వార్డు ఇంచార్జ్ లు కె.ఎం. నాయుడు,బొడ్డెడ శివ

🗞️ బిబి న్యూస్ | 05 May 2026

అనకాపల్లి, మే 5: YSRCP అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి వీరాభిమాని, పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన తర్వాత కోర్టుల ద్వారా బెయిల్ పొందారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ YSRCP సమన్వయ కర్త మలశాల భరత్ సూచనల మేరకు 80వ వార్డు ఇన్‌చార్జ్ కె.ఎం. నాయుడు, 81వ వార్డు ఇన్‌చార్జ్ బొడ్డెడ శివ మర్యాద పూర్వకంగా గజ మాల, శాలువా ధరించి ఘనంగా సత్కరించారు.సత్కార కార్యక్రమంలో మాట్లాడిన కె.ఎం. నాయుడు, బొడ్డెడ శివలు జగన్‌ని, YSRCP కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని, పూడి శ్రీహరికి చేసిన అన్యాయానికి తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని, అధికారం శాశ్వతం కాదని చెప్పారు. 2029లో వై.ఎస్. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలని పూడి శ్రీహరి సూచించారని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ కర్రి రుద్రి, 81వ వార్డు యూత్ ప్రెసిడెంట్ బుద్ద జగన్, ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ మరిశెట్టి శ్రీను, పట్టణ స్టూడెంట్ వింగ్ సెక్రటరీ దొడ్డి సాయి, కాండ్రేగుల శ్రీను మొదలైనవారు పాల్గొన్నారు.