దాడి వీరునాయుడు చొరవతో గవరపాలెం నీటి సమస్య పరిష్కారం – దాడి వీరునాయుడికి ప్రజల అభినందనలు
🗞️ బిబి న్యూస్ | 05 May 2026
అనకాపల్లి, గవరపాలెం గతంలో కూటమి ప్రభుత్వం కాలంలో దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో నిర్మించబడిన గవరపాలెం 81వ వార్డు,కొణతాల జగ్గప్పలస్వామి వీధి,దాడి వారి వీధికి చెందిన వాటర్ ట్యాంకు గత కొన్ని నెలలుగా సరిగా పనిచేయక నీరు నిలిచిపోయిన కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను గుర్తించిన దాడి వీరునాయుడు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనకాపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు సహకారంతో అధికారికంగా ఫిర్యాదు చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీంతో అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించి, వాటర్ ట్యాంక్‌ల ద్వారా మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరించారు.ఈ సందర్భంగా గవరపాలెం ప్రజలు దాడి వీరునాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సమస్యలపై త్వరగా స్పందించే నాయకులు ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.