📢 Advertisement Space

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ విడుదల

🗞️ బిబి న్యూస్ | 05 May 2026

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway – SCoR) జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన చారిత్రాత్మక ఘట్టమని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ పేర్కొన్నారు .కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మే 4, 2026న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ 1, 2026 నుంచి కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి వస్తుందని తెలిపింది .1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 3(4) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ అయినట్లు సమాచారం.ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవ వల్ల ఈ నిర్ణయం సాధ్యమైందని డాక్టర్ సి.ఎం. రమేష్ అన్నారు.అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర కృషి, కేంద్రంతో సమర్థమైన చర్చల ఫలితంగానే ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని ఆయన పేర్కొన్నారు .విశాఖపట్నం కేంద్రంగా స్వంత రైల్వే పరిపాలన వ్యవస్థ ఏర్పడటం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపు అని రమేష్ అభిప్రాయపడ్డారు .ఈ జోన్ ద్వారా రైల్వే మౌలిక సదుపాయాలు, కొత్త మార్గాలు, అదనపు రైళ్లు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్రాజెక్టుల ఆమోదం, కనెక్టివిటీ మెరుగుదల వేగవంతం అవుతాయని ఆయన వివరించారు.