తమిళనాడు విజయ్ విజయంతో పిఠాపురంలో అభిమానుల సంబరాలు.. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
🗞️ బిబి న్యూస్ | 05 May 2026
పిఠాపురం, మే 5: తమిళనాడు సినీ హీరో విజయ్ దళపతి స్థాపించిన టీవీకే పార్టీ విజయడంకా మోగించడంతో పిఠాపురంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. జై భీమ్ దళిత యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పట్టణం కత్తిలగూడెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిఠాపురం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ ఖండవల్లి లోవరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖండవల్లి చిన్న లోవరాజు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. భారీ ఎత్తున బాణాసంచలు కాల్చి ఆనందం వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా ఖండవల్లి లోవరాజు, ఖండవల్లి చిన్న లోవరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సికోలు శ్రీను, ఖండవల్లి నాగన్న, సికోలు మురళీకృష్ణ, ఖండవల్లి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.