అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మలశాల భరత్ ఆదేశాల మేరకు,గవరపాలెం సంతోషి మాత ఆలయ పూజారి సారిపల్లి కామేశ్వరరావు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న 80వ వార్డ్ ఇంచార్జ్ కె.ఎం. నాయుడు వెంటనే స్పందించారు.ఆలయానికి వెళ్లి పూజారి భార్యను పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.పేదలకు చేయూతనివ్వడం దేవుడికి సేవ చేసినట్టేనని 81వ వార్డ్ ఇంచార్జ్ బొడ్డెడ శివ పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కె.ఎం. నాయుడు ఎప్పుడూ ముందుంటారని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో 81వ వార్డ్ యూత్ ప్రెసిడెంట్ బుద్ద జగన్, ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ మారిశెట్టి శ్రీను, పట్టణ కమిటీ క్రియాశీల సభ్యుడు పేతకంశెట్టి గోపి, 81వ వార్డ్ రైతు విభాగం జనరల్ సెక్రటరీ కాండ్రేగుల శ్రీను, పట్టణ సోషల్ మీడియా సెక్రటరీ కాండ్రేగుల తులసి పాల్గొన్నారు.