📢 Advertisement Space

అనకాపల్లి జిల్లా పోలీసుల దాడిలో నక్కపల్లి జూద శిబిరం ధ్వంసంనగదు ₹11,460, మొబైల్‌లు స్వాధీనం

🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026

నక్కపల్లి, ఫిబ్రవరి 21: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టారు.ఈ పర్వతంలో నక్కపల్లి ఇన్‌స్పెక్టర్ మురళి నేతృత్వంలో ఎస్సై సన్నీబాబు, సిబ్బంది మంగళవారం నక్కపల్లి మండలంలో ఆకస్మిక దాడులు చేశారు.సెట్టిబలిజిపేట శివారులో రహస్యంగా జూదం (పేకాట) ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేశారు. ఈ దాడిలో జూదగాళ్ల వద్ద ₹11,460 నగదు, 3 మొబైల్ ఫోన్‌లు, పేకా ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.జూదానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, వారిపై సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.