📢 Advertisement Space

“ముక్కల మీడియాగా మారుతున్న జర్నలిజం

🗞️ బిబి న్యూస్ | 08 May 2026

ఒకప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన మీడియా, ప్రస్తుతం “ముక్కల మీడియా”గా మారిపోతోందన్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పూర్తి పత్రిక కనిపించకపోయినా, ఒక్కో వార్త మాత్రం చిన్న చిన్న క్లిప్పింగుల రూపంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామం నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా పూర్తి పేపర్ చదివే పరిస్థితి తగ్గిపోగా, ఒక్క వార్తను కత్తిరించి పంపించే విధానం పెరిగిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో అసలు వార్తల ప్రామాణికత, నేపథ్యం, విశ్లేషణ వంటి అంశాలు ప్రజలకు చేరడం లేదని అంటున్నారు.ఇక రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ సమావేశాలు, ప్రారంభోత్సవాలు వంటి చోట్ల కార్యకర్తల కంటే మీడియా ప్రతినిధుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోందని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “పేపర్ రాదు కానీ క్లిప్పింగులు మాత్రం నిమిషాల్లో వస్తున్నాయి” అంటూ సామాన్యులు చర్చించుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాల నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జర్నలిజం విలువలు కాపాడాలని, పూర్తి సమాచారం ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పులు చూసి “అసలు జర్నలిజం ఎటు వెళ్తోంది?” అనే ప్రశ్న ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.