హిందూజా బొగ్గు లారీలను వెంటనేనిలుపుదల చేయాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్
🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026
పరవాడ మండల పరిషత్ కార్యాలయం జంక్షన్ లో హిందూజా బొగ్గు లారీలనుఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలనుఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించడమే నరకంగా భావిస్తున్నారు అన్నారు. పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో మూసి వేయబడింది అన్నారు. ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి అన్నారు. హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని రకంగా కాలుష్యానికి నెట్టు వేయడం అన్యాయం అన్నారు. వెంటనే బొగ్గు దూళి లారీలపై చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. హిందూజా కంపెనీ బొగ్గు లారీలకు బదులుగా రైల్వే మార్గం ద్వారా బొగ్గు తరలించుకోవాలి తప్ప ఈ మార్గంలో ప్రయాణించడం వలన ప్రజల తీవ్ర అనారోగ్యాలు జబ్బులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే ఈ మార్గం నుండి బొగ్గు లారీలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హిందూజా కంపెనీకి అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో ప్రజల్ని కాలుష్యంలో హిందూజా యాజమాన్యం నెట్టివేస్తుందని ప్రభుత్వాలు కళ్ళు అప్పగించుకొని చూస్తున్నాయని గని శెట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పికొండ నాగరాజ్, శ్రీనివాసరావు, రాజు, సత్యనారాయణ, అప్పల నరసమ్మ, చిన్న, ఫాతిమా బేగం, తదితరులు పాల్గొన్నారు