మంచి పని చేయాలంటే ఆదేశాలు కాదు.. ఆశయాలు ఉంటే చాలు: కోరిబిల్లి పరి
🗞️ బిబి న్యూస్ | 08 Jun 2026
అనకాపల్లి, గూడ్స్ రోడ్డు:అనకాపల్లి గూడ్స్ రోడ్డు సమీపంలోని శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం వద్ద "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమాన్ని కోరిబిల్లి పరి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను శుభ్రపరుస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.స్వామివారి సన్నిధిలో సుమారు 80 మద్యం బాటిల్స్ బయట పడ్డాయని,సన్నిధిలో డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారని,సైరెన్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు.ఈ సందర్భంగా కోరిబిల్లి పరి మాట్లాడుతూ, పండుగలు వచ్చినప్పుడు మాత్రమే నెల రోజుల ముందుగా హడావిడి చేసి, అనంతరం ఆలయ పరిసరాలను నిర్లక్ష్యం చేయడం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద కనీస భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కొంతమంది యువకులు ఆలయ ప్రాంగణాన్ని చెడు వ్యసనాలకు, అనుచిత కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.అధికారులు, ప్రజాప్రతినిధులు తలచుకుంటే ఒక్కరోజులో పూర్తయ్యే పనులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు."మంచి పనులు చేయాలంటే ఆదేశాలు అవసరం లేదు.. మంచి ఆశయాలు ఉంటే చాలు" అని పేర్కొన్న ఆయన, వారం రోజుల్లో ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోతే తమ సొంత నిధులతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాండ్రేగుల దేవ, సత్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.