చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు: ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
🗞️ బిబి న్యూస్ | 12 Jun 2026
ఎలమంచిలి, BB News:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో సుమారు 2,000 బైకులతో ఈ ర్యాలీ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, ఎస్ఈసీ సభ్యుడు బోదేపు గోవిందు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదేపు ఎర్రయ్య దొరతో పాటు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో ఎలమంచిలి పట్టణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.