జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్
🗞️ బిబి న్యూస్ | 13 Jun 2026
అనకాపల్లి, BB News:
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సమన్వయకర్తలను ప్రకటించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ మాట్లాడుతూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మార్గదర్శకాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రతి బూత్‌లో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మల్లపురెడ్డి కోటేశ్వరరావు, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త తనకాల అనంతరావు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కామిరెడ్డి పాత్రుడు నాయుడు, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పడాల కొండలరావు, నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కచల్ల చినబాబు, అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సత్యనారాయణ, తుట్ట రమణ, గుణబాబు, అనకాపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్టమూరి నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.