📢 Advertisement Space

అనకాపల్లిలో కూటమి విజయోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలనలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ

🗞️ బిబి న్యూస్ | 15 Jun 2026

అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 17న నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పలువురు కూటమి నాయకులు నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బీమర్శెట్టి రాంకీ, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, కశింకోట మండల పార్టీ అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు, ఏపీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి తదితర కూటమి నాయకులు సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.