📢 Advertisement Space

ఎంఈవో డి.దివాకర్ మృతి.. విద్యాశాఖలో విషాదం

🗞️ బిబి న్యూస్ | 15 Jun 2026

అనకాపల్లి: కశింకోట, అనకాపల్లి మండలాల్లో మండల విద్యాశాఖ అధికారిగా (ఎంఈవో) సేవలందించిన డి. దివాకర్ ఇకలేరు. ప్రస్తుతం ఆయన గోపాలపట్నం మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. నేడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసిన దివాకర్ తన విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల మన్ననలు పొందారు. ఆయన ఆకస్మిక మరణ వార్త తెలిసి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దివాకర్ మరణం విద్యాశాఖకు తీరని లోటని పలువురు పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.