అనకాపల్లిలో కమలం వికసిస్తోంది.అనకాపల్లి బీజేపీ విస్తరణలో ద్వారపురెడ్డి, బొడ్డెడ, దాడి వీరునాయుడు కీలక పాత్ర
🗞️ బిబి న్యూస్ | 17 Jun 2026
అనకాపల్లి: బిబి న్యూస్:
గత 42 సంవత్సరాలుగా కరాటే రంగంలో విశేష సేవలు అందిస్తూ, వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించేలా తీర్చిదిద్దిన ప్రముఖ కరాటే గురువు, బ్లాక్ బెల్ట్ మాస్టర్ పీలా ఉమా మహేశ్వరరావు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఆధ్యాత్మికవేత్త దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పీలా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, కిక్‌బాక్సింగ్ రంగంలో 32 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన తన మిత్రుడు దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు నాయకత్వంలో పార్టీ ప్రజల కోసం చేస్తున్న సేవలు తనను ఆకర్షించాయని తెలిపారు. దేశాభివృద్ధి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, దాడి వీరునాయుడు కృషితో సమాజంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. దాడి వీరునాయుడు పార్టీలో చేరిన తర్వాత అనకాపల్లి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యాయని, పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా దాడి వీరునాయుడు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ప్రజా సేవ, సనాతన ధర్మ పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వారు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి సమర్థవంతమైన నాయకత్వం ప్రతి జిల్లాలో ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.కరాటే రంగంలో విశిష్ట సేవలు అందించిన పీలా ఉమా మహేశ్వరరావు వంటి వ్యక్తులు బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో పార్టీ విస్తరణతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.