📢 Advertisement Space

దాడి వీరునాయుడికి కాండ్రేగుల బ్రదర్స్ సత్కారం

🗞️ బిబి న్యూస్ | 18 Jun 2026

అనకాపల్లి: సనాతన ధర్మ పరిరక్షణతో పాటు బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న దాడి వీరునాయుడిని కాండ్రేగుల బ్రదర్స్ ఘనంగా సత్కరించారు. పండ్లు, కూరగాయల ఎగుమతి-దిగుమతి వ్యాపారి కాండ్రేగుల గంగరాజు, విశ్రాంత ఉపాధ్యాయులు కాండ్రేగుల సర్వేశ్వరరావు శాలువా కప్పి వీరునాయుడిని అభినందించారు.ఈ సందర్భంగా కాండ్రేగుల బ్రదర్స్ మాట్లాడుతూ, వీరునాయుడు బీజేపీలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం దాడి వీరునాయుడు మాట్లాడుతూ, తన మేనమామలైన కాండ్రేగుల బ్రదర్స్ చేతుల మీదుగా సత్కారం పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలు కాండ్రేగుల సత్యవతి వద్ద తాను కొంతకాలం విద్యాభ్యాసం చేశానని, గురువుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనకు మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులు, గురువుల ఆశీస్సులతో జరిగిన ఈ సత్కారం తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని వీరునాయుడు తెలిపారు.