📢 Advertisement Space

గవరపాలెంలో 81వ వార్డు 218వ బూత్ ఓటర్ వెరిఫికేషన్‌లో దాడి వీరునాయుడు చురుకైన పాత్ర

🗞️ బిబి న్యూస్ | 18 Jun 2026

అనకాపల్లి, జూన్ 18:
అనకాపల్లి గవరపాలెం 81వ వార్డులో 218వ బూత్ పరిధిలో నిర్వహిస్తున్న ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ నాయకుడు దాడి వీరునాయుడును బీఎల్‌ఏ-2 ఓటర్ వెరిఫికేషన్ చేసే బాధ్యతలు ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో భాగంగా వీరునాయుడు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, ఓటరు జాబితాలో ఉన్న పేర్లు, చిరునామాలు మరియు ఇతర వివరాల్లో సవరణలు అవసరమైన వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వెరిఫికేషన్ ప్రక్రియకు సహకరించాలని దాడి వీరునాయుడు కోరారు.218వ బూత్ పరిధిలో ఓటర్ వెరిఫికేషన్ బాధ్యతలను బీజేపీ తరఫున నిర్వహిస్తున్న ఆయన, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయడంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.