📢 Advertisement Space

కమలం వైపు పెరుగుతున్న ఆకర్షణ.. బీజేపీలోకి తిరిగి చేరిన స్వర్ణకారుడు దార్ల వెంకట రమణ మూర్తి

🗞️ బిబి న్యూస్ | 19 Jun 2026

అనకాపల్లి, జూన్ 19:అనకాపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పట్ల ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ స్వర్ణకారుడు దార్ల వెంకట రమణ మూర్తి బీజేపీ సీనియర్ నేతగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.ఇటీవల అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు మరియు ఆధ్యాత్మికవేత్త దాడి వీరునాయుడు చొరవతో ఆయనతో చర్చలు జరిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ నాయకులు చేస్తున్న కృషి, ప్రజాసేవా కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని దార్ల వెంకట రమణ మూర్తి తెలిపారు.ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీ సభ్యత్వం స్వీకరించి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, దాడి వీరునాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, సనాతన ధర్మ పరిరక్షణలో మరింత చురుకైన పాత్ర పోషించాలని నాయకులు ఆకాంక్షించారు. దార్ల వెంకట రమణ మూర్తి తిరిగి పార్టీలో చేరడం ద్వారా అనకాపల్లి జిల్లాలో బీజేపీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.