చీడికాడ, జూన్ 20: పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వెచ్చాలపు రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నక్కా జోగారావు, పైలా నరసింహ నాయుడు తదితరులు పాల్గొని రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న యువ నాయకుడు రాహుల్ గాంధీ మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.