అనకాపల్లి, జూన్ 19:
అనకాపల్లి పట్టణంలోని నర్సింగరావుపేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గ కన్వీనర్ మల్లపురెడ్డి కోటేశ్వరరావు, అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాపారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన మల్లపురెడ్డి కోటేశ్వరరావు, దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో సమర్థవంతంగా ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాపారపు సత్యనారాయణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.దేశ ప్రజల సమస్యలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చుట్ట రమణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.