బీజేపీ వైపు యువశక్తి... పార్టీ లో చేరిన యువ కెరటం సరిస కిరణ్
🗞️ బిబి న్యూస్ | 20 Jun 2026
అనకాపల్లి:అనకాపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ వైపు యువత కుడా అడుగులు వేస్తుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్,రాష్ట్ర బీజేపీ కమిటీ సభ్యులు కొణతాల రాజాబాయ్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలో బీజేపీకి యువత నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.మళ్ల వీధికి చెందిన యువ నాయకుడు సరిస కిరణ్, బీజేపీ సిద్ధాంతాలు మరియు సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యాలను మెచ్చి పార్టీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు,సీనియర్ నాయకుడు దాడి వీరునాయుడు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు యువతను ఆకర్షిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇప్పటివరకు ప్రధానంగా సీనియర్ నాయకుల చేరికలు కనిపించగా, తాజాగా యువ నాయకుడు సరిస కిరణ్ బీజేపీలో చేరడం జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. యువతలో బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.రానున్న రోజుల్లో మరింత మంది యువ నాయకులు బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయని, అనకాపల్లి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.