అనకాపల్లి, జూన్ 21: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి మండలంలోని సాయి రెసిడెన్సీ, కొండకొప్పాక గ్రామంలో బీజేపీ నాయకులు ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్, రాష్ట్ర బీజేపీ కమిటీ సభ్యులు కొణతాల రాజాబాయ్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు సూచనలతో, సీనియర్ నాయకుడు దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యోగా శిక్షకులు, అడ్వకేట్ నానాజీ పాల్గొని పలు యోగాసనాలను ప్రదర్శించారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం పాల్గొన్న వారితో కలిసి యోగాసనాలు చేయించారు.దాడి వీరునాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆదేశాల మేరకు యోగా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ అనకాపల్లి టౌన్ సీనియర్ నాయకులు కర్రి రామకృష్ణ, కొణతాల అప్పలరాజు, మండల నాయకులు, సాయి రెసిడెన్సీ సభ్యులు,పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.