ఏయూలో ఉద్రిక్తతకు ఆర్ ఎస్ ఎస్ కారణం : ప్రియాంక దండి
🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026
విశాఖపట్నం బీజేపీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీని విస్తరించాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏ ఎస్ ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నాయకులపై ఏ బి వి పి, ఆర్ ఎస్ ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నామని, ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చొరబడి గొడవలు చేయడానికి సిద్ధమవుతోందని, వీసీ ఆర్ ఎస్ ఎస్ సానుభూతిపరుడని చూసి చూడన్నటు వదిలేస్తాడని గతంలోనే హేచ్చరించానని, ఇప్పుడు అదే నిజమైందని ప్రియాంక అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ ఎస్ ఎస్ శాఖ కార్యకలాపాలు వాలీబాల్ కోర్టు మరియు మైదానంలో చేస్తుండగా ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నాయకులు ప్రశ్నించగా వారి పై దాడి చేసారని, వీసీ అనుమతి ఎలా ఇచ్చారని, ఏ బి వి పి కార్యక్రమాలలో ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వ్యక్తులు పాల్గొంటే వీసీ నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఏ యూ విద్యార్థుల పై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు చేసిన దాడి పై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రియాంక డిమాండ్ చేసారు. ఏ యూలో ఉద్రిక్తత తగ్గిన తరువాత విద్యార్థి నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ ఆర్ ఎస్ ఎస్ యూనివర్సిటీలో అడుగు పెట్టకుండ, విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టకుండ చర్యలు తీసుకోవాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, అలాంటిది ఆర్ ఎస్ ఎస్ మూకలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెడ్డ పేరు తీసుకువచ్చారని, యూనివర్సిటీలో శాంతియుత వాతావరానికి అధికారులుకు మరియు ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తామని ప్రియాంక తెలిపారు.