📢 Advertisement Space

యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల

🗞️ బిబి న్యూస్ | 21 Jun 2026

అనకాపల్లి, జూన్ 21:12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని యోగాభ్యాసం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన యోగా అభ్యాసకులు ప్రత్యేక యోగా విన్యాసాలు ప్రదర్శించారు.ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన జీవన విధానమని అన్నారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల నియంత్రణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంపొందించేందుకు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు, యోగా సాధకులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.