📢 Advertisement Space

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

🗞️ బిబి న్యూస్ | 23 Jun 2026

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారతదేశ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయత విలువలను సమాజంలో విస్తరింపజేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు.అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు, శ్రీ రాధా కృష్ణ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరీ గ్రంథాలయం ఉపాధ్యక్షులు, మాజీ BSNL TAC సభ్యులు దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో BL-2 పరిధిలో గవరపాలెం మహిళా కళాశాల, దాడి బోగలింగం జీవీఎంసీ పాఠశాల, అనకాపల్లి మండలం మారేడుపూడి గ్రామంతో పాటు తుమ్మపాల, కొండకొప్పాక మరియు అనకాపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా దాడి వీరునాయుడు మాట్లాడుతూ, భారతదేశ ఏకత్వం, సమగ్రత కోసం డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, జాతీయత విలువలను సమాజంలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో యల్లపు ఎస్. నాయుడు, పొలిమేర మోహన్ రావు, పెంటకోట తులసి, కర్రి అప్పలనాయుడు, కొణతాల పరమేశ్వరి, పీలా ఉమామహేశ్వరరావు, సరిస కిరణ్, దార్ల వెంకట రమణమూర్తి, కొయ్యి శ్రీను తదితరులతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అడ్వకేట్ నానాజీ పాల్గొని డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు అర్పించారు.