📢 Advertisement Space

బాధిత కుటుంబాలకు బీజేపీ నేతల పరామర్శ.. నిర్లక్ష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ద్వారపురెడ్డి పరమేశ్వరరావు

🗞️ బిబి న్యూస్ | 25 Jun 2026

అనకాపల్లి, జూన్ 25:
అనకాపల్లిలో జరిగిన పరిశ్రమ ప్రమాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, సీనియర్ బీజేపీ నేత దాడి వీరునాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించి ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, పరిశ్రమల్లో భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్లే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయించి కార్మికుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలపై ఉందని ఆయన పేర్కొన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్లు పారదర్శకంగా నిర్వహించి, ఉద్యోగులకు అవసరమైన భద్రతా పరికరాలు, శిక్షణ అందించాలని కోరారు.సీనియర్ బీజేపీ నేత దాడి వీరునాయుడు మాట్లాడుతూ, ఉద్యోగంలో చేరే ముందు ఆయా కంపెనీల భద్రతా ప్రమాణాలు, గత ప్రమాదాల చరిత్ర తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని యువతకు సూచించారు.కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్నారు.చివరగా బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.