ప్రజాస్వామ్య హత్య దినం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం – రైతులు, మహిళలకు బీజేపీలో ఘన స్వాగతం
🗞️ బిబి న్యూస్ | 25 Jun 2026
అనకాపల్లి:
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నేడు "ప్రజాస్వామ్య హత్య దినం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తండ్రి, దివంగత పీవీ చలపతిరావు కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన అనకాపల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు యర్రంశెట్టి సత్యారావు మాస్టారు, ఏ.ఆర్.జి. శర్మ, లంక సన్యాసిరావు, బొడ్డెడ వెంకట చలపతిరావు, వేచా వెంకటరావు, చుక్కా ప్రకాష్, కోలాటి అప్పారావులను ఘనంగా సన్మానించారు.అనంతరం సీనియర్ నాయకుడు దాడి వీరునాయుడు సమక్షంలో "జై జవాన్ – జై కిసాన్" నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో రైతు నాయకుడు శిలపరశెట్టి రామకృష్ణ, మహిళా నాయకులు కొణతాల పరమేశ్వరి, ఆడారి లక్ష్మీదుర్గ, మళ్ళ వేణి అలేఖ్యలను అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రైతులు, మహిళలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.చివరిగా, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులతో పాటు యల్లపు ఎస్. నాయుడు, పొలిమేర మోహన్ రావు, పెంటకోట తులసి, కర్రి అప్పలనాయుడు, కొణతాల పరమేశ్వరి, పీలా ఉమామహేశ్వరరావు, సరిస కిరణ్, దార్ల వెంకట రమణమూర్తి, కొయ్యి శ్రీను తదితరులు పాల్గొన్నారు.