📢 Advertisement Space

గవరపాలెం ఎన్టీఆర్ బస్ షెల్టర్ తొలగింపుపై వివాదం.అధికారుల అనుమతులపై ప్రశ్నలు

🗞️ బిబి న్యూస్ | 26 Jun 2026

అనకాపల్లి: గవరపాలెంలో ఎన్నో ఏళ్లుగా గుర్తింపుగా నిలిచిన శ్రీ నందమూరి తారకరామ బస్ షెల్టర్ తొలగింపు, కొత్త బస్ షెల్టర్ నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, రాయల్ క్లబ్ సభ్యులు, బాలకృష్ణ అభిమానులు కలిసి ఈ బస్ షెల్టర్‌ను నిర్మించారు.ప్రస్తుతం బస్ షెల్టర్ తొలగింపు, కొత్త నిర్మాణం సంబంధిత అధికారుల అనుమతులతోనే జరుగుతోందని స్థానికులు భావిస్తున్నప్పటికీ, ఈ విషయమై జివిఎంసి (GVMC) కమిషనర్‌ను సంప్రదించగా తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని తెలిపినట్లు సమాచారం.అధికారిక అనుమతులు లేకుండా ప్రధాన రహదారిపై వేరే చోట బస్ షెల్టర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులతో పాటు కూటమి నాయకులు స్పందించి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.