📢 Advertisement Space

అనకాపల్లి జిల్లా ఆరోగ్య రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్

🗞️ బిబి న్యూస్ | 26 Jun 2026

న్యూఢిల్లీ, జూన్ 26: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ శుక్రవారం కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అనకాపల్లి ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణ, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే చర్యలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతంపై ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.అనకాపల్లి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, నియోజకవర్గంలో వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ పేర్కొన్నారు.