📢 Advertisement Space

ఘనంగా పి.వి. చలపతి రావు 92వ జయంతి సందర్భంగా 4వ స్మారక ఉపన్యాస సభ ..... వీర సావర్కర్ నాటికకు మంచి స్పందన

🗞️ బిబి న్యూస్ | 27 Jun 2026

అనకాపల్లి, జూన్ 27 (బీబీ న్యూస్):
పి.వి. చలపతి రావు 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన 4వ స్మారకవీర సావర్కర్ ఉపన్యాస సభ విశాఖ,సాగరమాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. సభలో భాగంగా ప్రదర్శించిన "వీర సావర్కర్" జీవిత విశేషాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబించే నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని దేశభక్తి స్ఫూర్తిని నింపింది.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని భావితరాలకు చేరవేసే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను అభినందించారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భావజాలం ప్రజల్లో మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.సమాజ సేవ, విలువలతో కూడిన ప్రజాజీవితానికి పి.వి. చలపతి రావు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ నివాళులర్పించారు. ఆయన చూపిన ఆదర్శాలను అనుసరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చొరవతో పాటు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా వ్యాప్తంగా మండల నాయకులను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పలువురు నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, కర్రి రామకృష్ణ, దాడి వీరునాయుడు, తరణ దాలినాయుడు, మళ్ల కాళేశ్వరరావు, అడ్వకేట్ నానాజీ, సన్యాసిరావు, జర్నలిస్ట్ సాయి, పలకా రవి, తాతారావు, గరికి వెంకటరావు, బొడ్డెడ శేషగిరిరావు, కొణతాల సాయిరామ్ ప్రసాద్, కొణతాల వెంకట్, రాజు, పంచాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి, జాతీయ విలువలను చాటిచెప్పే విధంగా విజయవంతంగా ముగిసింది.