అదిరిన చిట్టిముత్యాల బిర్యానీ... రుచి కరమైన వంటలు అంటే ఇష్టం: రామరాజు
🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో మెగాస్టార్ చిరంజీవి అభిమాని అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కశింకోట కు చెందిన ఉత్తాడ రామరాజు.చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే ప్రాణం అదే మార్గంలో రాష్ట్ర చిరంజీవి అభిమానులకి ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీకి ఎంతో సేవచేసి ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కి కూడా తనదైన వంతు సేవచేస్తున్న మెగా అభిమాని రామరాజు.ఇదంతా ఒకవైపు మరోవైపు రామరాజుకు ఇంకో ఇష్టం కూడా ఉంది అదే ఆహారం మంచి ఆహారం అంటే చాల ఇష్టం.అదే ఇష్టం తో మంచి రుచికరమైన ఆహారం ఇవ్వాలనే గొప్ప ఉద్దేశ్యంతో కశింకోట నుండి అనకాపల్లి వెళ్ళే నేషనల్ హైవే పక్కన కశింకోట లో శ్రీ నూకంబికా హోటల్ అనే పేరుతో ఒక హోటల్ పెట్టడం జరిగింది.అంతే కాకుండా అతనే వంట నేర్చుకొని తనచేతుల మీదుగా అధ్బుతమైన బిర్యానీ తో సరి కొత్తగా చిట్టిముత్యాల్ బిర్యానీ అనే పేరుతో తెగ పేరు తెచ్చేసుకున్నారు .ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా రామరాజు చిట్టి ముత్యాల బిర్యానీ పేరే వినిపిస్తుంది అంతే కాకుండా ప్రతి రోజూ ఒక్కో ప్రత్యేకమైన వంటకం తో కౌజు కోడి బిర్యానీ,మటన్ బిర్యానీ,రొయ్యల బిర్యానీ,పీతల బిర్యానీ,నాటుకోడి బిర్యానీ,నెల్లూరి చేపల పులుసు,ఇలా ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ తో రామరాజు ఆహార ప్రియులను తన ఘుమఘుమలతో నేషనల్ హైవే లో వెళ్ళే వాళ్లకు బ్రేక్ లు వేయించి మరీ విందు ఆరగించేలా చేస్తున్నారు.అంతే కాకుండా త్వరలో చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం పన్నెండు బ్రాంచులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆహార ప్రియులు అక్కడ కూడా తమను ఆదరించాలని రుచిలో ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు రామరాజు.