📢 Advertisement Space

అనకాపల్లిలో 'మా ఇంటి బంగారం' చిత్ర బృందానికి ఘన సత్కారం

🗞️ బిబి న్యూస్ | 27 Jun 2026

అనకాపల్లి, జూన్ 27 (బీబీ న్యూస్):
తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'మా ఇంటి బంగారం' చిత్ర బృందానికి అనకాపల్లిలో ఘన సత్కారం నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మళ్ళ సురేంద్ర చిత్ర దర్శకుడు, రచయిత, నటుడు గవిరెడ్డి శ్రీనివాస్‌తో పాటు చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు భారతి ఆనంద్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన గవిరెడ్డి శ్రీనివాస్ చలనచిత్ర రంగంలో దర్శకుడు, రచయిత, నటుడిగా తనదైన ముద్ర వేసి అనకాపల్లి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. గతంలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, అనుభవించు రాజా చిత్రాలకు దర్శకుడిగా, వీరసింహారెడ్డి, క్రాక్ చిత్రాలకు రచయితగా, శుభం, కుమారి శ్రీమతి, గరం తదితర చిత్రాల్లో నటుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో 'బుచ్చిరాజు' పాత్రలో గవిరెడ్డి శ్రీనివాస్ అద్భుతమైన నటన కనబరిచారని ప్రశంసించారు. అలాగే ఆయన హీరోగా నటించిన చీన్ టపాక్ డుం డుం చిత్రం అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని, ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొణతాల ప్రసాద్, బి.టి. కుమార్, పీలా వెంకట్ అప్పారావు, ఎస్. భానుచందర్ (అఖి), జొన్నాడ సురేష్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.