📢 Advertisement Space

“ఐ లవ్ అనకాపల్లి ” ఎక్కడ ?

🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026

అనకాపల్లికి జిల్లా హోదా వచ్చినప్పటి నుండి ప్రజల్లో ఆనందం నెలకొన్నా, నగర అభివృద్ధి పరంగా కొన్ని సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని నగరవాసులు చెబుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు పలు చోట్ల గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక అందమైన పట్టణాల చిహ్నంగా పలు జిల్లాల్లో “ఐ లవ్ ” బోర్డులు ఏర్పాటు చేయగా, అనకాపల్లి జిల్లాలో కూడా అలాంటి స్వాగత బోర్డు ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎ ఏం ఎ ఎల్ కాలేజ్ జంక్షన్ వద్ద “ఐ లవ్ అనకాపల్లి ” బోర్డు ఏర్పాటు చేస్తే నగర సౌందర్యం మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయాన్ని ప్రజలు వెల్లడించారు.స్థానిక ప్రజా సంఘాలు మరియు యువత ఈ ప్రతిపాదనను మున్సిపల్ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లా కేంద్రానికి ఆకర్షణీయమైన రూపు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.